శుక్రవారం రాత్రి కమలాపురం రైల్వే స్టేషన్ పరిధిలో దుండగులు ఒక ద్విచక్ర వాహనానికి నిప్పంటించి దహనం చేశారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా కాలిపోయింది. నిప్పంటించిన వ్యక్తులు, వాహన యజమాని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.