వల్లూరులోని మబ్బు దేవాలయం రాతి గోడలపైన వెలకట్టలేని శిల్ప కళా సంపద ఉందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. వేల కోట్లకు ఈ శిల్ప సంపద చాటి చెబుతోందన్నారు. గ్రామ ప్రజలు ఇలాంటి పురాతనమైన ఆలయాలను మళ్లీ మనుగడలోకి తీసుకుని వచ్చి పూజలు నిర్వహిస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. అధికారులు స్పందించి పురాతన ఆలయాలను చరిత్ర అనువాలను కనుమరుగు కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.