
కారు బ్రేక్‌డౌన్.. మంచు మనోజ్ ఆటోలో ప్రయాణం వైరల్!
హీరో మంచు మనోజ్, తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో ఆటోలో ప్రయాణించారు. వారి కారు అకస్మాత్తుగా బ్రేక్‌డౌన్ అవ్వడంతో, ట్రాఫిక్‌లో ఇబ్బంది పడకుండా వెంటనే ఆటో ఎక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మనోజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "కారు ఈరోజు కుదరదు అన్నప్పుడు.. హైదరాబాద్ ట్రాఫిక్ ‘ఎక్కేయ్’ అంటుంది" అని సరదాగా క్యాప్షన్ పెట్టారు. ఈ అనుభవం తమకు మర్చిపోలేనిదని ఆయన తెలిపారు.




