చింతకొమ్మదిన్నె మండలం శివాజీనగర్‌లో వైవీయూ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-9 వాలంటీర్లు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీఓ డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోడ పత్రాలు అంటించి, వ్యాధి లక్షణాలు, నివారణపై సదస్సు ఏర్పాటు చేశారు. మందుల కంటే మనలో వచ్చే మార్పు, బాధ్యతే ఎయిడ్స్‌ను అంతం చేస్తాయని, అవగాహనే ఆరోగ్యమని శ్రీనివాసరావు గ్రామస్తులకు తెలిపారు.