Jan 20, 2026, 07:01 IST/
గర్భిణీలకు పారాసిటమాల్ సురక్షితమేనా!
Jan 20, 2026, 07:01 IST
గర్భధారణ సమయంలో పారాసిటమాల్ వాడకం వల్ల పిల్లల్లో నాడీ సంబంధిత సమస్యలు వస్తాయన్న వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రముఖ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్’ స్పష్టం చేసింది. లండన్‌లోని సిటీ సెయింట్ జార్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అస్మా ఖలీల్ నేతృత్వంలో యూరోప్ పరిశోధక బృందం 43 అధ్యయనాలను విశ్లేషించి ఈ నివేదికను ప్రచురించింది. గర్భిణులకు పారాసిటమాల్ సురక్షితమని, నొప్పి, జ్వరాన్ని నిర్లక్ష్యం చేయడం తల్లీబిడ్డలకు ఎక్కువ ప్రమాదకరమని పేర్కొంది. వైద్యుల సూచనల మేరకు అవసరమైనప్పుడు వాడటం భద్రమని అధ్యయనం భరోసా ఇచ్చింది.