
మదనపల్లె జిల్లా స్వప్నం సాకారం కానుంది: జనసేన నేత రాందాస్
మదనపల్లెకు జిల్లా హోదా కల్పించే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని జనసేన రాష్ట్ర కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, ఏఎంసీ చైర్మన్ శివరాం తెలిపారు. శనివారం మదనపల్లె ఏఎంసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు మదనపల్లెకు అన్యాయం చేశాయని, అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో మదనపల్లె జిల్లాగా రూపుదిద్దుకోబోతోందని వారు పేర్కొన్నారు. మదనపల్లెకు జిల్లా హోదాకు అన్ని అర్హతలు ఉన్నాయని వారు తెలిపారు.




































