మదనపల్లెలో భూకబ్జా ఆరోపణలు – మురళిపై ఫిర్యాదులు

2945చూసినవారు
మదనపల్లెలో భూకబ్జా ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, పట్టణానికి చెందిన మేజారి మురళిపై పలువురు బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. శుక్రవారం ఒక బాధితుడు తెలిపిన ప్రకారం, మురళి తన వద్ద రూ. లక్ష తీసుకుని, అదే పట్టాను మరొకరికి విక్రయించి మోసం చేశాడని వాపోయాడు. ఇటీవల కోళ్లబైలు ప్రాంతంలో నకిలీ మిలిటరీ పట్టాతో భూమి కబ్జా చేసిన ఘటనలోనూ మురళి ప్రమేయం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్