అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం, ఈడిగపల్లి సమీపంలోని కమ్మోరుపల్లి గ్రామానికి చెందిన సురేంద్ర భార్య రేఖ (36) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఇంట్లో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం రుయాకు రెఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.