మదనపల్లెలో ఆటో బోల్తా – నలుగురికి తీవ్ర గాయాలు

7చూసినవారు
మదనపల్లె మండల పరిధిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, ఆటో డ్రైవర్‌తో సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుర్రంకొండ మండలం టి. రాసుపల్లికి చెందిన సిద్ధారెడ్డి(92) అనారోగ్యంతో ఉండటంతో, అతని కుమార్తె అనసూయమ్మ(60), మనవరాలు సాయివాణి(25), అదే గ్రామానికి చెందిన రెడ్డప్పరెడ్డి(49) ఆటోలో మదనపల్లెకు బయలుదేరారు. శానిటోరియం సమీపంలో కుక్క అకస్మాత్తుగా ఎదురుగా రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయని తాలూకా ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్