వి. కోట ఆంధ్రజ్యోతి విలేకరి
జగన్ మోహన్ రెడ్డి మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు వి. కోటలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా సహా పలు ప్రాంతాల నుంచి జర్నలిస్టులు భారీగా తరలివచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.