ఫెయిల్ అయినా నిరాశ చెందొద్దు: ఎస్పీ ధీరజ్ సూచనలు

2చూసినవారు
ఫెయిల్ అయినా నిరాశ చెందొద్దు: ఎస్పీ ధీరజ్ సూచనలు
రాష్ట్రవ్యాప్తంగా గురువారం పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. విజయాలు, అపజయాలు జీవితంలో సహజమని, ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన తెలిపారు. పాస్ అయినా, ఫెయిల్ అయినా ఎవ్వరూ అధైర్యపడకూడదని, తల్లిదండ్రులు ఓదార్చి ప్రోత్సహించాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మళ్లీ అవకాశం ఉంటుందని గుర్తుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్