మంగళవారం వేకువజామున కడప నుంచి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలోని మంచినీళ్ల కోట వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి, మరికొందరిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతులు, గాయపడిన వారిలో కడప, రాయచోటి, బెంగళూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.