మదనపల్లె: మహిళలకు 33% సీట్ల కేటాయింపు చారిత్రాత్మకం -సుగవాసి

7చూసినవారు
మదనపల్లె: మహిళలకు 33% సీట్ల కేటాయింపు చారిత్రాత్మకం -సుగవాసి
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే టీడీపీ నిర్ణయంపై మదనపల్లెలో శుక్రవారం హర్షం వ్యక్తమైంది. టీడీపీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు, చంద్రబాబు డ్వాక్రా ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశారని, లోకేష్ రాజకీయ సాధికారతకు బాటలు వేశారని నేతలు కొనియాడారు.

సంబంధిత పోస్ట్