మదనపల్లి జిల్లా ఏర్పాటు అనేది ఒక వ్యక్తి కృషి కాదని, ఇది ప్రజల దీర్ఘకాల పోరాటాల ఫలితమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పేర్కొంది. జిల్లా కోసం సంవత్సరాలుగా పోరాడిన ఉద్యమకారులు, ప్రజా నాయకులు, యువత, మరియు ప్రజలందరికీ సీపీఐ విప్లవ నమస్కారాలు తెలియజేసింది. పోలీసు నిర్బంధాలు, కేసులు ఎదుర్కొంటూ న్యాయస్థానాల చుట్టూ తిరిగిన నాయకులను, సోషల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన యువతను పార్టీ అభినందించింది.