మదనపల్లి: ఎయిర్‌టెల్ టవర్ జనరేటర్ గదిలో అగ్ని ప్రమాదం

12చూసినవారు
మదనపల్లి: ఎయిర్‌టెల్ టవర్ జనరేటర్ గదిలో అగ్ని ప్రమాదం
మదనపల్లిలోని సిటిఎం ప్రాంతంలో సోమవారం రాత్రి ఎయిర్‌టెల్ టవర్ జనరేటర్ గదిలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్షల రూపాయల విలువైన బ్యాటరీలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగలు కమ్ముకున్నప్పటికీ, సిబ్బంది అప్రమత్తతతో పరిస్థితిని చక్కదిద్దారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్