రాష్ట్ర ఉమెన్ కమిషన్ సభ్యురాలు డాక్టర్ షేక్ రొకియా బేగం మంగళవారం మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మాట్లాడుతూ, ఆడబిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగాలు సాధించి స్థిరపడితేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, తప్పటడుగు వేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆమె హెచ్చరించారు. అనంతరం సీడీపీఓ కార్యాలయాన్ని పరిశీలించారు.