మదనపల్లి: ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: ముబారక్

3చూసినవారు
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఏపీ ఆటో డ్రైవర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముబారక్ డిమాండ్ చేశారు. ఆదివారం మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ, మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్రం ఇంధన ధరలు తగ్గించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ 'వాహన మిత్ర' అందేలా సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లెలో ఆటో స్టాండ్లకు స్థలం కేటాయించేలా ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవ చూపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్