మదనపల్లె: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

19చూసినవారు
మదనపల్లె: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఎమ్మెల్యే షాజహాన్ భాషా సందర్శించారు. వైద్య సేవలు, సిబ్బంది హాజరుపై వైద్యులతో సమీక్ష నిర్వహించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఏఓను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో రాజీ పడొద్దని, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్