మదనపల్లి: యాసిడ్ తాగి నేతన్న ఆత్మహత్యాయత్నం

మదనపల్లెలో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన 54 ఏళ్ల బాబు అనే నేత యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం నీరుగట్టువారిపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో కోలుకుంటున్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
