మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ మంగళవారం మదనపల్లె మండలం కొత్త ఇండ్లలో మాట్లాడుతూ, పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం పేద విద్యార్థులకు అన్యాయం అవుతుందని అన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటుకు అప్పగిస్తోందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా వైసిపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.