మదనపల్లె: మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన' - జిల్లా ఎస్పీ

6చూసినవారు
మదనపల్లె: మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన' - జిల్లా ఎస్పీ
మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లాలో 'ఆపరేషన్ దండాయన'ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు శుక్రవారం ఎస్పీ ధీరజ్ తెలిపారు. మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ, స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చూస్తున్నామన్నారు. ఇప్పటివరకు మహిళలపై నేరాలకు పాల్పడిన 16 కేసుల్లో శిక్షలు పడ్డాయని, పునరావృత నేరస్థులపై 'సెక్సువల్ అఫెండర్ షీట్లు' తెరిచి నిఘా ఉంచామని, మహిళల రక్షణలో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్