మదనపల్లి: అధికారి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు

4చూసినవారు
మదనపల్లి: అధికారి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాచవీటివారిపల్లికి చెందిన భాస్కర్ (48), సుజాత (38), భారతి (22) సీటీఎం రోడ్డులో గారబురుజు వద్ద ఆటో కోసం రోడ్డు పక్కన నిలబడి ఉండగా, ఫారెస్ట్ అధికారి బోర్డు ఉన్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్