మదనపల్లె మున్సిపాలిటీ సమీపంలో మంగళవారం రాత్రి పాత కక్షల నేపథ్యంలో ప్రసాద్ (41) అనే వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. గొడవను ఆపడానికి వెళ్లిన వైసీపీ మాజీ మేదర కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుబ్బుపై కూడా కత్తితో దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో గిరీష్, షఫీ, ముని, మస్తాన్, ఫరీద్‌లు పాల్గొన్నారని తెలిసింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.