మదనపల్లి: మద్యం షాపులో యువకుడు అనుమానాస్పద మృతి

17చూసినవారు
మదనపల్లి: మద్యం షాపులో యువకుడు అనుమానాస్పద మృతి
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లిలోని దినకర్ వైన్స్ లో మంగళవారం సాయంత్రం 35 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు మద్యం తాగుతూ మృతి చెందాడు. షాపులోని సిట్టింగ్ రూంలో మద్యం సేవిస్తుండగా ఆకస్మికంగా కుప్పకూలి మరణించినట్లు సమాచారం. రెండవ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్