కుటుంబ కలహాల నేపథ్యంలో, మంగళవారం రాత్రి మదనపల్లెలో ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కొత్తపల్లి పంచాయతీ ఈశ్వరమ్మ కాలనీకి చెందిన 50 ఏళ్ల పఠాన్ బాబు, కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.