
జనవరి 1 నుంచి భారత్ టాక్సీ సేవలు ప్రారంభం
ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్ యాప్‌లకు పోటీగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారత్ టాక్సీ సేవలను జనవరి 1న ప్రారంభించనుంది. అధిక ధరలు వసూలు చేస్తున్న ప్రైవేట్ యాప్‌ల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ చౌకైన సేవలను ప్రవేశపెడుతున్నారు. భారత్ టాక్సీ యాప్‌లో బైక్, ఆటో, కారు బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.




