మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం మాజీ ముఖ్యమంత్రి
ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష, జేసీ శివ నారాయణ శర్మ
ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని, వెండితెరపై పౌరాణిక పాత్రల ద్వారా మెప్పించడంతో పాటు, రాజకీయాల్లో మండల వ్యవస్థ, మహిళలకు ఆస్తి హక్కు, రూ. 2లకే కిలో బియ్యం వంటి విప్లవాత్మక పథకాలతో ప్రజా సంక్షేమానికి కట్టుబడ్డారని వారు కొనియాడారు.