ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమాటా మార్కెట్ యార్డు పారిశుధ్య లోపంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల టన్నుల కొద్దీ కుళ్లిన టమాటాలు, చెత్తకుప్పలు పేరుకుపోయాయి. దీంతో మార్కెట్ ప్రాంగణమంతా తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈగలు, దోమలు విజృంభించి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని రైతులు, వ్యాపారులు, హమాలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చెత్తను తొలగించి, ఫాగింగ్ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.