కురవంక పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు వేతనాల కోసం నిరసన

32చూసినవారు
మదనపల్లెలోని కురవంక పంచాయతీలో మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వార్డు సభ్యుడు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, 12 వార్డుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, వీధిలైట్లు సిబ్బంది, బిల్ కలెక్టర్, వాటర్ మ్యాన్, ఆటో డ్రైవర్లకు వేతనాలు నిలిచిపోయాయని తెలిపారు. పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్ కారణంగా జీతాలు జారీలో ఆలస్యం అవుతోందని, వెంటనే సెక్రటరీని నియమించి, వేతనాలు విడుదల చేయాలని ఎంపీడీవోను కోరారు.