శనివారం మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రిభాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ వనజ, బహుజన సేన నాయకులు భాను ప్రకాష్ మాట్లాడుతూ, సావిత్రిభాయి పూలే మహిళల విద్య విధాతగా, సంఘసంస్కర్తగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహా త్యాగమూర్తిగా, మూఢనమ్మకాలు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ మూర్తిగా ఆమెను అభివర్ణించారు.