మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, మహిళల విద్యతోనే సమాజం సంపూర్ణంగా వికసిస్తుందని అన్నారు. శనివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యకు బాటలు వేసిన మహనీయురాలని, తాడిత, పీడిత వర్గాల ఆశాజ్యోతిగా, నేటి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మనుజ రెడ్డి పాల్గొన్నారు.