మదనపల్లె టమోటా మార్కెట్లో టమోటా తరలించే డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను, అనగా అధిక ఒత్తిడి, లోడింగ్-పార్కింగ్ ఇబ్బందులు, బాడుగ తగ్గింపులు వంటి వాటిని రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ ట్రేడ్ యూనియన్ నేతలు బుధవారం ఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్‌కు వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి త్వరలోనే మార్కెట్‌ను బైపాస్ రోడ్డుకు మార్చి శాశ్వత పరిష్కారం అందిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు.