పుంగనూరులో కారు ఢీకొని తమిళనాడు వాసికి తీవ్ర గాయాలు

0చూసినవారు
పుంగనూరులో కారు ఢీకొని తమిళనాడు వాసికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన నెహ్రు రాజ్ (40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వరి కోత పనుల కోసం యంత్రంతో ఈడిగపల్లికి వచ్చిన అతన్ని, భోజనానికి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్