మదనపల్లె నారాయణ జూనియర్ కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని తన్మయి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్16 పోటీల్లో ఆమె ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యారు. నవంబర్ 18 నుంచి అనంతపురంలో జరిగే టైర్–1 జాతీయ జూనియర్ బాలికల ఛాంపియన్‌షిప్‌లో ఆమె పాల్గొంటారు. తల్లిదండ్రులు, కోచ్‌లు, జిల్లా, రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారులు ఆమెను అభినందించారు.