అన్నమయ్య జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ శుక్రవారం మదనపల్లెలో జరిగిన ఎన్-కార్డ్ సమీక్షలో స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలనకు 'ఆపరేషన్ వజ్రప్రహార్', 'సేఫ్ జోన్ క్యాంపస్', 'ఆపరేషన్ గరుడ'లను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని, పాత నేరస్థులపై పీఐటీ ఎన్‌డీపీఎస్ చట్టం కింద చర్యలు ఉంటాయని, సమాచారం కోసం ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972ను సంప్రదించాలని సూచించారు.