మదనపల్లిలో కళకళలాడుతున్న కొత్త కలెక్టరేట్

27చూసినవారు
మదనపల్లి కేంద్రంగా బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు హాజరుతో అధికారులతో కళకళలాడింది. జిల్లాలోని 25 మండలాల నుంచి వివిధ శాఖల అధికారులు వీరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా స్వీట్లు పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :