అర్ధరాత్రి విద్యుత్ నిలిపితల్లి–కూతురిని చంపుతామని బెదిరింపు

14చూసినవారు
మదనపల్లి మండలం సవరంవారి పల్లిలో సోమవారం అర్ధరాత్రి విద్యుత్ నిలిపివేసి, తల్లి-కూతుళ్లను చంపుతామని ప్రత్యర్థులు బెదిరించిన ఘటన వెలుగుచూసింది. ఆస్తి వివాదం నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన నరసింహులు, రమేష్ లు బాధితులు ఇంట్లో ఉండగా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. భయాందోళనకు గురైన బాధితులు డయల్-100కు కాల్ చేసి పోలీసుల సహాయం కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్