మదనపల్లిలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా జూన్ 4 నుండి 12 వరకు ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డల నిధి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. జగన్ హయాంలో సంక్షేమం బాగుండగా, కూటమి ప్రభుత్వం 6 లక్షల పెన్షన్లు తొలగించిందని మండిపడ్డారు.