
మైదుకూరులో జూదరుల స్థావరాలపై పోలీసుల దాడి: 16 మంది అరెస్ట్
మైదుకూరు మండలం పోతిరెడ్డిపల్లె గ్రామ పొలాల్లో జూదం ఆడుతున్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైదుకూరు అర్బన్ సీఐ కె. రమణా రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు చిరంజీవి, వెంకటరమణ బృందం ఈ దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి రూ. 1, 58, 000 నగదు, 14 మొబైల్ ఫోన్లు, 17 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పరారైన మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, చట్టవిరుద్ధ పనులపై కఠినంగా వ్యవహరిస్తామని సీఐ హెచ్చరించారు.








































