వాకింగ్ చేస్తుండగా యువకులను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరి మృతి

1చూసినవారు
వాకింగ్ చేస్తుండగా యువకులను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరి మృతి
మైదుకూరు-బద్వేల్ రహదారిపై జీవి సత్రం వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాకింగ్ చేస్తున్న యువకులను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమంత్ (25) అక్కడికక్కడే మృతి చెందగా, మదన్ గోపాల్ (25) మైదుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విజయ్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్