ప్రమాదకర పరిస్థితిలో అల్లాడుపల్లి - సీతారామపురం వంతెన

6చూసినవారు
ప్రమాదకర పరిస్థితిలో అల్లాడుపల్లి - సీతారామపురం వంతెన
చాపాడు మండలం అల్లాడుపల్లి - సీతారామపురం మధ్యలో కుందు నదిపై ఉన్న పాత బ్రిడ్జి మధ్యలో కుంగిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ బ్రిడ్జిపై గ్రామస్తులు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, బ్రిడ్జిపై ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు వెంటనే స్పందించి, ఆ ప్రాంతాన్ని పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :