చెన్నూరులో శిశువు విక్రయం కలకలం... కన్నతల్లి చెంతకు పసికందు

5చూసినవారు
చెన్నూరులో శిశువు విక్రయం కలకలం... కన్నతల్లి చెంతకు పసికందు
చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పసికందును విక్రయించిన ఘటనలో పోలీసులు వెంటనే స్పందించి, చిన్నారిని సురక్షితంగా కాపాడారు. బాధితురాలు లక్ష్మీనారాయణమ్మ ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరులో గాలింపు చేపట్టిన పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి స్వీపర్ సుబ్బమ్మ వద్ద ఉన్న శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పసికందును తల్లికి అప్పగించి, ఇద్దరినీ భద్రత కోసం వన్ స్టాప్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై ఐసీడీఎస్, పోలీసుల విచారణ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్