బ్రహ్మంగారిమఠం మండలం నాగిరెడ్డిపల్లిలో రైతులు తమ పొలాలకు వెళ్లే దారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో 15 అడుగుల ఉన్న మార్గాన్ని రైతులు ఉపయోగించారు. ఇప్పుడు ఓ వ్యక్తి కంచె వేయడంతో ఆ దారికి మూత పడింది. స్థలం వివాదస్పదమైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.