మైదుకూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, తొలి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రంగసింహ మృతి చెందారు. ఆయన మృతి పట్ల మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ, మున్సిపల్ చైర్మన్‌గా ప్రజలకు చేసిన సేవలు గుర్తించదగినవని ఆయన అన్నారు. వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని మైదుకూరు ప్రజలు తమ సానుభూతిని వ్యక్తం చేశారు.