దువ్వూరు: ఎర్రచందనం దొంగపై నాలుగోసారి PD యాక్ట్

13చూసినవారు
దువ్వూరు: ఎర్రచందనం దొంగపై నాలుగోసారి PD యాక్ట్
దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేటకు చెందిన ఎర్రచందనం దొంగ ఇరుగంరెడ్డి నాగ దస్తగిరి రెడ్డిపై నాలుగోసారి పీడీ యాక్ట్ నమోదైంది. మైదుకూరు గ్రామీణ సీఐ శివశంకర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, నాగ దస్తగిరి రెడ్డిపై మొత్తం 128 కేసులున్నాయి. వీటిలో 80 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు, 38 చోరీ కేసులున్నాయి. ప్రస్తుతం ఇతను కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు.

సంబంధిత పోస్ట్