మైదుకూరు మండలం పప్పనపల్లి పంచాయతీ ఓబులాపురం గ్రామంలో రామసుబ్బారెడ్డి పొలంలో రెండు నెలలుగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగల వల్ల ప్రమాదం ముంచుకొస్తోందని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ తెలిపారు. గురువారం ఆయన విద్యుత్ లైన్లను పరిశీలించి, ఈ సమస్యను వనిపెంట విద్యుత్ అధికారులకు తెలియజేశారు. పరిష్కారం లభించకపోతే విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని రమణ హెచ్చరించారు.