
ఈదురుగాలులతో కూడిన వర్షం
AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్ద బొడ్డేపల్లి, ఆర్ అండ్ బీ బంగ్లా తదితర ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.




