బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగిన మాదిగ యువకుల జంట హత్యలపై దర్యాప్తును వేగవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో, మార్చి 7వ తేదీన కాజీపేట మండలంలో నిర్వహించనున్న మాదిగల నిరసన మహా ప్రదర్శనలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొంటారని ఎమ్మార్పీఎస్ కడప జిల్లా అధ్యక్షులు ఎం వెంకటేష్ మాదిగ తెలిపారు. కాజీపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసనను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.