మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డు, కేసీ కెనాల్ సమీపంలో గురువారం రాత్రి ఆర్‌టీపీపీ పైప్‌లైన్ పగిలిపోయింది. దీనివల్ల భారీగా నీరు లీకై ఆ ప్రాంతమంతా జలమయమైంది. రోడ్డుపై నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి, నీటి సరఫరాను నిలిపివేసి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.