మైదుకూరు ఎస్వీ స్టడీ సర్కిల్‌లో గురువారం మై
భారత్, అమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో సావర్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మై
భారత్ అధికారి ఐసయ్య మాట్లాడుతూ యువత సావర్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వక్త పందిటి పెద్దయ్య సావర్కర్‌ను గొప్ప దేశభక్తుడిగా అభివర్ణించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, శరత్, సిబ్బంది పాల్గొన్నారు.